
413views
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) స్వయం సేవకుల పథ సంచలన్ కార్యక్రమం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రధాన వీధుల మీదుగా నేత్రపర్వంగా జరిగింది.శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది ఉత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్ణ గణవేష్‌తో ఆదివారం ఈ కార్యక్రమం చేపట్టారు. శారీరక, మానసిక క్రమశిక్షణకు మారుపేరైన స్వయం సేవకులు భగవాధ్వజం వెంట,ఘోష్‌కు అనుగుణంగా అడుగులు కలుపుతూ ముందుకు సాగడం, సంఘ్ అభిమానులు వారిపై పూలవర్షం కురిపించడం చూపరులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో గుంటూరు విభాగ్ ప్రచారక్ శ్రీ గౌతమ్ తో పాటు పూర్ణ గణవేశ్ ధారి స్వయం సేవకులు, గణవేష్‌లో లేని వారు, మాతృమూర్తులు, పలువురు స్వయంసేవకులు పాల్గొన్నారు.





