
ముస్లిం సమాజానికి ప్రార్థనా మందిరం మసీదు. మసీదులో నమాజ్ చేసుకుంటే ఎవ్వరికీ ఇబ్బంది వుండదు. కానీ.. కొందరు ఏకంగా వీధుల్లోకి వచ్చి, రోడ్లపైనే నమాజ్ చేస్తున్నారు. దీంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా… ఢిల్లీలో ఎంఐఎం నేతలు బహిరంగంగా రెచ్చిపోయారు. తాము ఏకంగా ఢిల్లీ వీధుల్లోనే నమాజ్ చేస్తామని ఎంఐఎం నేతలు పట్టుబడుతున్నారు. దీనికి ఎంఐఎం ఢిల్లీ అధ్యక్షుడు షోయబ్ జమై నాయకత్వం వహించారు. ఢిల్లీ ఏమీ మీరటో, సంభాలో కాదని… ఏకంగా బెదిరింపులకే దిగాడు. తాము రోడ్లపైనే నమాజ్ చేస్తామంటూ ఓ రకంగా రెచ్చగొట్టేంత వ్యాఖ్యలు చేశారు.
అసలు జరిగిందిదీ… రోడ్లపై నమాజ్ చేసే అంశంపై షాకూర్ బస్తీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కర్నైల్ సింగ్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి లేఖ రాశారు. రోడ్లపై నమాజ్ చేస్తే ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతుందని, దీని వల్ల ప్రజలు కూడా ఇబ్బందుల్లో పడతారని పేర్కొన్నారు. అందుకే రోడ్లపై నమాజ్‌ని నిషేధించాలని అందులో సూచించారు. మరోవైపు ఢిల్లీ స్పీకర్ మోహన్ సింగ్ బిష్త్ కూడా పోలీసులకు ఇదే తరహాలో లేఖ రాశారు.
దీంతో ఢిల్లీ ఎంఐఎం అధ్యక్షుడు షోయబ్ జమై స్పందించారు. కన్వర్ యాత్రను నమాజ్‌తో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. రహదారిపై నమాజ్ చేసే అంశాన్ని గట్టిగా సమర్థించారు. ఢిల్లీ ఏమైనా సంభాల్, మీరట్ కాదంటూ రెచ్చగొట్టారు. ఇది ఢిల్లీ అంటూ ప్రకటించారు. వీధుల్లో నమాజ్ చేస్తామని, ఇళ్లల్లో, పైకప్పులపై కూడా నమాజ్ చేస్తామని ప్రకటించారు. కన్వర్ కోసం గంటల తరబడి రోడ్లను బ్లాక్ చేయవచ్చు గానీ.. నమాజ్ కోసం 15 నిమిషాలు బ్లాక్ చేయరా? అంటూ వ్యాఖ్యానించారు.





