News

వెయ్యేళ్ల నాటి వెయ్యి నాగుల శిల్ప శకలం లభ్యం

563views

క్షిణభారత దేశంలోనే అరుదైన, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు వెలుగు చూడని 1000 నాగుల (సహస్రనాగ) శిల్ప శకలం, గుంటూరు జిల్లా క్రోసూరు మండలం వేల్పూరులో బయల్పడిందని పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈవో డా ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. వేల్పూరులోని దేవతలదిబ్బ అనే నాగులకట్ట మీద గతంలో పడి ఉన్న ఒక బండను పెకలించగా అనేక వరుసలలో బొమ్మలు చెక్కిన శిల్పంగా భావించిన స్థానికులు, ఆ శిల్పాన్ని ఆలయానికి ఈశాన్య భాగంలో నిలబెట్టి పూజలు చేస్తున్నారన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం ఈ శిల్పాన్ని క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. రెండు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల ఎత్తు, నాలుగు అంగుళాల మందం ఉన్న రాతిపైన 24 వరుసల్లో ఒక్కొ వరుసకు 26 చొప్పున 624 నాగ శిల్పాలు కనిపిస్తున్నాయని, పగిలిపోయిన భాగంలో ఉండే నాగశిల్పాలతో కలిసి మొత్తం 1000 నాగుల బొమ్మలుంటాయన్నారు. శైలిని బట్టి ఈ శిల్పం వేంగీ చాళుక్యుల క్రీ.శ 10వ శతాబ్ది కాలానికి చెందినదని శివనాగిరెడ్డి అన్నారు.

Source : Andhra Bhoomi

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.