News

కశ్మీర్ వేర్పాటువాదం గత చరిత్ర కానుంది : అమిత్ షా

395views

జమ్ముకశ్మీర్‌లో హురియత్ దుకాణం మూతపడనుంది. ఇక్కడి జనం వేర్పాటువాదానికి స్వస్తిపలికి, భారత రాజ్యాంగంపై తమ విధేయతను ప్రకటిస్తున్నారు. కశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు వేర్పాటువాదానికి ముగింపు పలికేలా కనిపిస్తున్నాయి. హురియత్ కాన్ఫరెన్స్‌లోని భాగస్వామ్య పార్టీలైన జమ్ము అండ్ కశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జేకేపీఎం), జే అండ్‌ కే డెమోక్రటిక్ పొలిటికల్ మూవ్‌మెంట్ (జేకేకేపీఎం) ఇకపై వేర్పాటువాదంతో తమకున్న అన్ని సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

ప్రభుత్వం అనుసరి స్తున్న ఏకీకృత విధానాలు సత్ఫలితాల నిస్తున్నాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. జమ్మూకశ్మీర్ నుంచి వేర్పాటువాదాన్ని తరిమేశామన్నారు. అక్కడి వేర్పాటువాదం గత చరిత్రగా మిగిలి పోనుందని వ్యాఖ్యానించారు. తాజాగా, జమ్మూకశ్మీర్లోని వేర్పాటు వాద పార్టీల కూటమి హురియత్ కాన్ఫ రెన్స్ మూడు పార్టీలు తెగదెంపులు చేసుకున్నాయని అమిత్ షా ప్రకటించారు. ఇది ఐక్య భారత్ కు మరింత బలాన్నిచ్చే పరిణామమని ఆయన ‘ఎక్స్’లో తెలిపారు.

ఇది భారతదేశ ఐక్యతను బలోపేతం చేస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. జేకేపీఎంకు షాహిద్ సలీం నాయకత్వం వహిస్తుండగా, జేకేడీపీఎంకు న్యాయవాది షఫీ రేషి సారధ్యం వహిస్తున్నారు. ఇటీవల షాహిద్‌ సలీం తాను, తన సంస్థ వేర్పాటువాద భావజాలానికి దూరం అయ్యామని, భారతదేశ రాజ్యాంగంపై విధేయతను కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు.

అంతకుముందు, హురియత్ కాన్ఫరెన్స్ నుంచి వైదొలు గుతున్నట్లు జమ్మూకశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్(జేకేపీఎం) చైర్పర్సన్ షాహిద్ సలీం ప్రకటించారు. భారతదే శం, రాజ్యాంగానికి బద్దుడనై ఉం టానని ప్రకటించారు. ఇకపై జేకేపీఎం హురియత్, ఇతర వేర్పాటువాద గ్రూపులతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోబోదని స్పష్టం చేశారు. ఈ గ్రూపులు కశ్మీర్ ప్రజల న్యాయబద్ధమైన ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. శ్రీనగర్ లోని గుల్బెర్గ్ కాలనీకి చెందిన మరో నేత, లాయర్ మహ్మద్ షఫీ రెషీ కూడా హరియత్ కాన్ఫరెన్స్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 2017 వరకు జమ్మూకశ్మీర్ డెమోక్రాటిక్ పాలిటికల్ మూవ్మెంట్ కు ఈయన అధ్యక్షుడిగా పనిచేశారు. వేర్పాటువాద గ్రూపులకు ఇక నుంచి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. భారత పౌరుడిగా, చట్టానికి లోబడి పనిచేస్తానని చెప్పారు. మహ్మద్ షరీఫ్ సర్తాజ్ సారథ్యంలోని జమ్మూకశ్మీర్ ఫ్రీడం మూవ్మెంట్ కూడా హురియత్ ను వీడుతున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ సారథ్యంలోని హురియత్ కాన్ఫరెన్స్ లోని అవామీ యాక్షన్ కమిటీ, జమ్మూకశ్మీర్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే గ్రూపులపై ఉపా చట్టం కింద ఐదేళ్ల నిషేధం విధించింది.