
289views
రాబోయే నవరాత్రులను దృష్టిలో ఉంచుకుని ఆలయాలకు సమీపంలోని మాంసం దుకాణాలను మూసివేయాలని ఢిల్లీ బీజేపీ ఎంపీ రవీంద్ర నెగీ దుకాణదారులను అభ్యర్థించారు. ఈ నెల 30 నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 7 వరకూ కొనసాగే ఈ నవరాత్రులలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఉత్తరాదిన చైత్ర నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి.
నవరాత్రి వేడుకలు హిందువులకు ఎంతో పవిత్రమైనవని, ఈ సమయంలో ఆలయాల సమీపంలోని మాంసం దుకాణాలు తెరిచి ఉంటే హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ఎంపీ రవీంద్ర నెగీ పేర్కొన్నారు. అందుకే ఆ దుకాణాలను నవరాత్రులలో మూసివేయాలని కోరారు. నెగీ అభ్యర్థన నేపధ్యంలో ఢిల్లీ సర్కారు నవరాత్రి సమయంలో ఢిల్లీవ్యాప్తంగా ఉన్న మటన్ దుకాణాలను మూసివేయించే దిశగా యోచిస్తోందని ఇండియా టీవీ తన కథనంలో పేర్కొంది.





