News

నంద్యాలలో సంఘమిత్ర ఆధ్వర్యంలో షహీద్ దివస్

355views

నంద్యాల జిల్లా, సంఘమిత్ర ఆవాసంలో దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంభా లెక్కిన అమర వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల షహీద్ దివస్ (బలిదాన దినం) సంస్మరణ సమావేశం స్ఫూర్తిదాయకంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా భారత మాత, అమర వీరుల చిత్రపటాల వద్ద జ్యోతి ప్రజ్వలన, మాలార్పణ తరువాత, సభికులందరు భక్తి ప్రపత్తులతో పుష్పాంజలి ఘటించారు.

తదుపరి పెద్దలు అమరవీరుల త్యాగాలను ప్రస్పుటింప జేసే నాటి సంఘటనలను, దేశ కాల పరిస్థితులను కనులకు కట్టినట్టు వివరించి చిన్నారుల్లో దేశభక్తిని నింపారు. ఈ మధ్య వారు చూసిన చావా సినిమాను ఉటంకిస్తూ స్పూర్తిని కలిగించారు.

ఈ కార్యక్రమం సంఘమిత్ర అధ్యక్షుడు శ్రీ చిలుకూరి శ్రీనివాస్ అధ్యక్షతన ప్రారంభమవగా, ఈ సమావేశంలో కార్యదర్శి శ్రీ కర్నాటి నాగ సుబ్బారెడ్డి, సహ కార్యదర్శి శ్రీ సుందర్ రావు, కార్యవర్గ సభ్యులు డా. అశోక్, శ్రీ రమణయ్య, శ్రీ రామాంజనేయులు, ఆవాసం సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.

చివరిగా శాంతి పాఠంతో సమావేశం సంపన్నమైంది.