News

పాడేరులో మిలిసియా సభ్యులు లొంగబాటు…

402views

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మావోయిస్టు పార్టీలకు గతంలో సహాయం చేసిన పలు కార్యకలాపాలలో పాల్గొన్న సానుభూతిపరులు ఇద్దరు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన సానుభూతిపరులను మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో మావోయిస్టులకు సహాయ సహకారాలు అందించి పలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్పడిన సానుభూతిపరులు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాలను ఆకర్షితులై స్వచ్ఛందంగా లొంగిపోతున్నారని వారికి పునరావాసం కల్పిస్తామని అన్నారు.

గిరిజన ప్రజలు మావోయిస్టులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించరాదని మావోయిస్టు మీలిసియ సభ్యులు స్వచ్ఛందంగా పోలీసుల వద్ద లొంగిపోవాలని ఎటువంటి భయాందోళన చెందరాదని అన్నారు.

లొంగిపోయిన సభ్యులకు పోలీస్ శాఖ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పునరావాసానికి చర్యలు చేపడుతామని అన్నారు.