News

గురునానక్ పై ప్రత్యేక నాణేలను విడుదల చేసిన పాక్

725views

సిక్కు మత స్థాపకుడు గురునానక్ పై పాకిస్థాన్ ప్రభుత్వం ప్రత్యేక నాణేలను విడుదల చేసింది. గురు నానక్ 550వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఈ నాణేలను ముద్రించినట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. నాణెం ఫొటోను ఆయన బుధవారం తన అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. వచ్చే నెల 9వ తేదీన భారత్ కు చెందిన వేలాదిమంది సిక్కులు పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ ను సందర్శించబోతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని నరోవాల్ జిల్లాలో గల కర్తార్ పూర్ గురుద్వారను సందర్శించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఇదివరకే వీసాలను జారీ చేసింది.

గురు నానక్ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని 50 రూపాయల విలువ గల నాణేలను లక్షల సంఖ్యలో ముద్రించినట్లు ఎవాక్యు ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీపీబీ) ఛైర్మన్ డాక్టర్ అమీర్ అహ్మద్ వెల్లడించారు. ఈ నాణేలను భారతీయ సిక్కుల కోసం అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపారు. కర్తార్ పూర్ గురుద్వారను సందర్శించడానికి భారత్ సహా విదేశాల నుంచి వేల సంఖ్యలో వచ్చే సిక్కులు వాటిని కొనుగోలు చేయవచ్చని చెప్పారు. గురు నానక్ ను ఆరాధించే పాకిస్థానీయులు కూడా వాటిని కొనుగోలు చేయవచ్చని, దాన్ని పెద్త ఎత్తున చలామణిలోకి తీసుకొస్తామని అన్నారు.
మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.