
ముక్కోటి దేవతల ఆత్మను తనలో నింపుకొని విశ్వమంతా వ్యాపించిన ఏకైక శబ్దమే ఓంకారం. అలాంటి ఓంకార శబ్దం అణువణువునా నింపుకున్న క్షేత్రమే ఓంకార క్షేత్రం.

మానవ నిర్మిత యంత్రాల రొద ఈ ప్రాంతాన్ని చేరక ముందు ఈ క్షేత్ర పరిసరాల్లో ఎక్కడ కూర్చున్నా ఓంకార నాదం వినిపించేదని విన్న పెద్దలు చెప్పేవారు. అందుకే ఈ క్షేత్రానికి ఓంకారం అన్ని పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఈ పవిత్ర ఓంకార క్షేత్రం కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలో ఉంది. అలాంటి ప్రాశస్త్యం గల ఈ క్షేత్రంలో ఆంధ్ర రాష్ట్ర యోగ, ఓంకార సాధన సమితి ఆధ్వర్యంలో నవంబరు 9,10 తారీఖులలో 33వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు, దక్షిణ భారత స్థాయి ఓంకార నాదం మరియు శంఖనాదం పోటీలు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ఉత్తర భారత దేశం నుండి గంగా హారతిలో పాల్గొనే నాగా సాధువులు విచ్చేయుచున్నారు. ఈ పోటీలలో 8 నుంచి 60 సంవత్సరముల వయస్సు కలిగిన వారు ఎవరైనా పాల్గొన వచ్చని, పోటీల్లో పాల్గొన దలచిన ఔత్సాహికులు, పోటీలను చూడదలచినవారు 9440291309 (రాంప్రసాద్) నంబరులో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్రంలోని యోగ సాధకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఓంకార సాధనా సమితి వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





