News

విద్య కాషాయీకరణ వ్యాఖ్యలపై లోకేష్ మండిపాటు

224views

రాష్ట్రంలో విద్యను కాషాయీకరణ చేస్తున్నారంటూ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు ఆరోపణలు చేసారు. హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ల గురించి చొప్పించారని ఆరోపించారు. ఆ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో విద్య గురించి చర్చ జరిగింది. ఆ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు కూటమి ప్రభుత్వంలో విద్యను కాషాయీకరిస్తున్నారంటూ ఆరోపణలు చేసారు. దానిపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యలోకి మతాన్ని, రాజకీయాలనూ తెచ్చి వివాదాలు రేపవద్దన్నారు. దానికి బొత్స సత్యనారాయణ సర్దిచెప్పారు. తమ పార్టీ సభ్యుడి మాటలు తప్పయితే రికార్డుల నుంచి తొలగించాలని సూచించారు. బొత్స సూచనను లోకేష్ స్వాగతించారు.