
289views
ఏలూరు జిల్లా కుక్కునూరులో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న గోవులను స్థానికులు పట్టుకుని వెటర్నరీ సిబ్బందికి అప్పగించారు. వివరాల ప్రకారం ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన గోవులను కొందరు వింజరం రేవు వద్ద గోదావరి దాటించి తీసుకెళ్లడాన్ని గమనించిన స్థానికులు విలేకరులకు, వెటర్నరీ ఏడీకి సమాచారం అందించారు. వెంటనే ఆ శాఖ సిబ్బంది వచ్చి తనిఖీ చేసి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో గోవులను బందెలదొడ్డికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై బీజేపీ, విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ గోవుల అక్రమ రవాణాకు కుక్కునూరు మండలం రాజమార్గంలా తయారైందని విమర్శించారు. అధికారులు గోవులను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





