News

101 సామాజిక మాధ్యమ ఖాతాలపై చర్యలు, తొక్కిసలాటను చూపిస్తూ కుట్రలు

339views

మహా కుంభమేళాకు సంబంధించితప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణపై ఇంతవరకు 10 కేసులలో 101 సామాజిక మాధ్యమ ఖాతాలపై చర్యలు చేపట్టినట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు. తప్పుడు పోస్టులు, వదంతులను ప్రచారంలోకి తెస్తున్నవారిపై నిరంతర నిఘా విధించామని చెప్పారు. పాపాలను కడిగేసుకునే ప్రయత్నంలో ప్రజలు తమ ప్రాణాలే కోల్పోతున్నారంటూ రూపొందించిన వీడియోలో కుంభమేళా తొక్కిసలాటగా చూపిన దృశ్యాలు పాకిస్థాన్ లోని కరక్ జిల్లాకు సంబంధించినవని వివరించారు. ఇలాంటి ప్రచారంపై 26 ఖాతాలమీద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అగ్నిప్రమాదం జరిగినట్లు, నదిలో మృతదేహాలను పడవేస్తున్నట్లు రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చారని పోలీసులు తెలిపారు.