
కుంభమేళాలో పవిత్ర స్నానం చేయాలనుకుంటున్న ఖైదీల కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. త్రివేణీ సంగమంలోని పవిత్ర జలాలను అన్ని కారాగారాలకు తీసుకువెళ్లి, అక్కడి నీళ్లలో కలపనున్నారు. పవిత్ర స్నానాల అనంతరం పూజలు, ఇతర క్రతువులకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని, చరిత్రలో ఇది తొలిసారి అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అరుదుగా 144ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా కోట్ల మంది భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరాలు, పాపాలు చేసిన ఖైదీలు సైతం అయ్యే మేం కూడా మహాకుంభమేళాకు వెళితే బాగుండనుకోవడం సహజం. వారి కోరికను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతీర్చే ప్రయత్నం చేస్తుంది.
అయితే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మహాకుంభమేళా గంగా స్నానం చేసే అవకాశం కల్పిస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా 75 జైళ్లలోని 90 వేలకు పైగా ఖైదీలకు ప్రయాగ్ రాజ్ గంగా జలాలతో స్నానం చేసే అవకాశం కల్పిస్తామని అధికారుల వెల్లడించారు. ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర జలాలను సేకరించి.. ఆయా జైళ్లకు తరలిస్తామని జైలు శాఖ అధికారులు తెలిపారు.
యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పుణ్య స్నానాలు చేయాలనుకున్న ఖైదీలు సంబర పడుతున్నారు. ఏదీ లేని చోట ఎంతోకొంత ఉత్తమమే కదా అన్నట్లుగా ప్రత్యక్షంగా కుంభమేళకు వెళ్లలేకపోయినప్పటికి జెళ్లోనే ఉండి ఇక్కడకు వచ్చ త్రివేణి సంగమం పవిత్ర జలాల్లో పుణ్యస్నానాలు చేసి మమ అనిపించుకోవడం మంచిదనుకుంటు పవిత్ర జలాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 26వరకు మాత్రమే మహాకుంభమేళా ఉన్నందునా అప్పటికల్లా జైళ్లకు ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర జలాలను సేకరించి పంపించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.





