
274views
కేంద్ర హోం శాఖామంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా ఈ నెల 26న ఒకరోజు రాష్ట్రానికి రానున్నారు. ఆయన కోవై జిల్లా వెలయంగిరి ప్రాంతంలోని ఈషా ఆశ్రమంలో జరిగే శివారాత్రి వేడుకల్లో పాల్గొంటారు. కేంద్రమంత్రి పర్యటన నేపథ్యంలో ఈశా యోగా కేంద్రంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు.
మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొనే ముందు జిల్లా కేంద్రం రామనాథపురంలో కొత్తగా నిర్బించిన బీజేపీ కార్యాలయాన్ని కేంద్రమంత్రి ప్రారంభిస్తారని కమలాలయ వర్గాలు తెలిపాయి. ఇక ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనే అమిత్‌షాకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేపట్టనున్నట్లు బీజేపీ నిర్వాహకులు తెలిపారు.





