
కీలకమైన అయోధ్య భూ వివాదం కేసులో 40వ రోజు విచారణ ఈరోజు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం ఐదుగంటల కల్లా వాదనలు ముగించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగన్ గొగోయ్ ఉభయ పక్షాలకు స్పష్టం చేశారు. నేడు వాదనలు ముగిస్తే సుప్రీం కోర్టు చరిత్రలో సుదీర్ఘ కాలం విచారణ జరిగిన రెండో కేసుగా ఇది రికార్డుల్లోకి ఎక్కనుంది.
తుది అంకంలో వరుసగా 39 రోజుల నుంచి సుప్రీంకోర్టు ఉభయపక్షాల వాదనలు వింటోంది. తొలుత అక్టోబరు 18 నాటికల్లా విచారణ పూర్తిచేయాలనుకుంది. ఆ తర్వాత అందుకు ఓ రోజు ముందే అంటే 17వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఇప్పుడు అంతకంటే ముందే 16వ తేదీనే (బుధవారం) విచారణను పూర్తి చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. రంజన్ గొగోయ్ పదవీ విరణ పొందనున్న నవంబరు 17నాటికి ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అయోధ్యలో 144సెక్షన్ విధించిన విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





