News

రామనారాయణం ఓ అద్భుతం

160views

రామనారాయణం ఓ అద్భుత కావ్యమని, స్వయంగా రామాయణాన్ని కళ్లకు కట్టినట్లు కనిపించే దృశ్యకావ్యాలు అమోఘంగా ఉన్నాయని తెలుగు సినీనటుడు అవసరాల శ్రీనివాస్‌ అన్నారు. విజయనగరం మండలంలోని రామనారాయణం ప్రాంగణాన్ని ఆయన సందర్శించారు. ఆలయం అంతా కలియదిరిగారు. ఆలయం లోపల ఉన్న రామాయణ గాథ చిత్రాలతో పాటు, వేదపాఠశాల, వాల్మీకి రీసెర్చ్‌ సెంటర్‌, అలాగే 80 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ప్రాంగణంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి పూర్తిగా ఓ అద్భుతమైన ప్రపంచం కనిపిస్తోందన్నారు. ఇంతటి అమోఘమైన ఆలయ రూపకర్తలకు అభినందనలు తెలపక తప్పదన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు రామాయణ ప్రాంగణం జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు.