
హిమాచల్ ప్రదేశ్ లోని ధరంపూర జామియా మసీదు ఇస్లామిక్ ఉగ్రవాదుల పుట్ట అని ఇస్లామిక్ మేధావి ఎస్.ఎన్.ఏ గిలానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మసీదు ఇస్లామిక్ ఉగ్రవాదానికి కీలకమైన కేంద్రమని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి మసీదు వైపే వెళ్లింది.హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, దీంతో హిమాచల్ ప్రదేశ్ తో పాటు దేశానికి కూడా తీవ్ర హానికారకమని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీనిపై దృష్టి సారించాలని సూచించారు. ముస్లిం ఛాందసులు హిమాచల్ ప్రదేశ్ లో హిందూ మహిళలను అధిక సంఖ్యలో మతం మార్చారని, అలాగే బయటి ప్రాంతాలకు కూడా బలవంతంగా తీసుకెళ్లారని సంచలన విషయాన్ని వెల్లడించారు.
దీంతో హిమాచల్ ప్రదేశ్ భౌతిక, సామాజిక రూపం పూర్తిగా మారిపోతోందన్నారు. ఈ విషయంలో తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింలు ఇక్కడ మసీదులు, శ్మశానవాటికలు నిర్మించారని, దీంతో ఈ ప్రాంతం సామాజిక సామరస్యానికి కూడా తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులు శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని, హిందూ మహిళలు, హిందూ యువతులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. ఇలా కొనసాగడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
సోలన్ జిల్లాలోని ధరంపూర్ లోని జామా మసీదు ఉగ్రవాదానికి, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు, హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు ఓ కీలకమైన నిలయమని వెల్లడించారు. ఆర్మీ హెడ్ క్వార్టర్స్, ఆర్మీ స్టేషన్, సీఆర్పీఎఫ్ కార్యాలయాలు… ఇలా దేశ భద్రతకు సంబంధించిన చాలా కార్యాలయాలు ఈ మసీదుకి సమీపంలోనే వున్నాయన్నారు. ఈ మసీదు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తుందని, బయటి వ్యక్తులు ఈ మసీదును తమకు స్థావరంగా మార్చుకున్నారన్నారు.
ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా అంత ఎక్కువగా లేదని, అయినా బయటి వ్యక్తులు వచ్చి, దీనిని తమ స్థావరంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి శుక్రవారం ధరంపూర్ మసీదుకి చాలా మంది వస్తున్నారన్నారు. అక్కడే నివసించే ముస్లింలు చాలా తక్కువ అని, కానీ.. ఇప్పుడు అద్దె ఇళ్లల్లో వుంటున్నారన్నారు. దీనిపై వెంటనే లోతైన దర్యాప్తు జరిపించాలని గిలానీ డిమాండ్ చేశారు. అసలు మసీదును అన్ని అనుమతులతోనే నిర్మించారా? అంటూ ప్రశ్నించారు. దీనిపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే కూల్చేస్తారని కూడా హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని, తగిన అనుమతులు లేకుంటే.. వెంటనే కూల్చేయాలన్నారు.
హిమాచల్ లో భద్రతా పరమైన ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ముస్లిం విద్యావంతుడు గిలానీ చేసిన వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మసీదు కేంద్రంగానే అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. తక్కువ ముస్లిం జనాభా వున్న ప్రాంతాల్లో పెద్ద పెద్ద మసీదులు కడుతున్నారని, ఎందుకు నిర్మిస్తున్నారని గిలానీ ప్రశ్నించారు. దీని వెనుక వున్న ఉద్దేశాలేమిటో వెంటనే తెలిపోవాలన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.





