
256views
శోభాయమానంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సతీసమేతంగా ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులతో ఈవో కార్యాలయంలో రథసప్తమి నిర్వహణ, ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పండుగగా నిర్ణయించిన రథసప్తమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాల న్నారు. తొలిసారి అధికారికంగా మూడు రోజుల పండుగను నిర్వహిస్తున్నామని, ప్రపంచం మనవైపు చూసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. యూత్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా జడ్పీ సమావేశ మందిరంలో అభిప్రాయాల సేకరణ చేపట్టనున్నట్టు తెలిపారు





