News

సర్వే ముంగిట మరొక మసీదు

373views

ఇప్పుడు రాజస్తాన్ లోని అతలా మసీదు. వంతు, అతలా మసీదు నిజానికి అతలా దేవి -ఆలయమని, దీనినే కూల్చి మసీదుగా మార్చారని ఆరోపిస్తూ జౌన్పూర్ జిల్లా సీనియర్ డివిజన్ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ మసీదులోను సర్వే చేసే అంశం మీద కోర్టు డిసెంబర్ 16న తుది నిర్ణయం ప్రకటిస్తుంది. స్వరాజ్ వాహిని అనే ప్రజా సంఘం (ఉత్తరప్రదేశ్) ఈ పిటిషన్ దాఖలు చేసింది. 13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని రాజా విజయచంద్ర నిర్మించారని, ఫిరోజ్ షా తుగ్లక్ మసీదుగా మార్చాడని పిటిషన్లో పేర్కొన్నారు.. రామ్సంగ్ కేసు వాదిస్తున్నారు. ఇప్పుడు సర్వేకు నిర్ణయం తీసుకుంటే పోలీసు బందోబస్తు మాత్రం ఉండాలని అడ్వకేట్ కోరారు. సంభాల్ అనుభవం అలాంటిది మరి!