
వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ అక్షయ తృతీయ సందర్భంగా,పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దిఘా అనే చోట నిర్మించిన, పూరీ జగన్నాథ్ తరహా ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిసెంబర్ 12న ప్రకటించారు. ఆ రోజు ఆమె దిఘాలో ఆలయం నిర్మాణం ఎంతవరకు నచ్చిందో వెళ్లి స్వయంగా చూసి వచ్చారు. ఈ నిర్మాణం పనిలో ఇస్కాన్ కోల్కతా నగర శాఖ అధ్యక్షుడు రాధారమణ్ కూడా సభ్యునిగా ఉన్నారు. చిత్రం ఏమిటంటే రూ 250 కోట్లు ఈ ఆలయ నిర్మాణం కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చింది. ఒడిశా -సరిహద్దులలోనే సాగర తీరంలోని 20 ఎకరాల స్థలంలో ఈ అలయాన్ని నిర్మిస్తున్నారు. సంప్రదాయ బద్ధంగా స్వామివారి లోగిలిని ఉడ్చే బంగారు చీపురు కోసం తాను స్వయంగా రూ. 5 లక్షలు ఇస్తున్నట్టు కూడా మమతా ప్రకటించారు. నిజానికి పూరీలో రధయాత్ర సమయంలో మూడు రథాలను బంగారు. బంగారు చీపురుతో శుభ్రపరుస్తారు. అయితే దిఘా జగన్నాథ ఆలయం పూరీ ఆలయానికి ఎంత మాత్రం నమూనా కాలేదని బీజేపీ నాయకుడు ప్రతిపక్ష నేత సువేందు అధికారి విమర్శించారు. పూరీ ఆలయం చార్ ధామ్ లో ఒకటిగా చెప్పుకుంటామని, దిఘా ఆలయం అందుకు ప్రత్యామ్నాయం మాత్రం కాలేదని అన్నారు. అలాగే మతాలకు సంబంధించిన నిర్మాణాల కోసం ప్రజాధనం వినియోగించరాదని కూడా అధికారి అన్నారు.





