
225views
కేరళలోని శబరిమల ఆలయం ఈ ఏడాది మకరజ్యోతి పండుగ సందర్భంగా సోమవారం నుంచి తెరుచుకుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రధాన పూజారి తంత్రి కందర్ రాజీవరు నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు మేళశాంతి ఎస్ అరుణ్‌కుమార్ ఆలయాన్ని తెరిచారని చెప్పారు.ఈ పండుగలో భాగంగా ప్రతి ఏడాది జనవరి 14న సంక్రా ంతి నాడు భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు. మండల పూజ అనంతరం డిసెంబర్ 26న ఆలయాన్ని మూసివేశారు. 41 రోజులపాటు సాగిన పూజల్లో వేలాది భక్తులు పాల్గొన్నారు.





