News

పులివెందులలో 8వ శతాబ్దం నాటి శిలాశాసనం

343views

వైయస్సార్ జిల్లా పులివెందులలో 8వ శతాబ్దకాలంనాటి శిలాశాసనం బయటపడింది. దీనిని పులివెందులకు చెందిన జిల్లా పరిషత్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ మల్లేపల్లి అశోక్‌కుమార్‌ గుర్తించి రచయిత డాక్టర్‌ వేంపల్లె గంగాధర్‌కు చూపించారు. ఆయన పురావస్తు శాఖ అధ్యయన విభాగం, మైసూరుకు పంపించడంతో ఇది 8 – 9 శతాబ్దం నాటిదని వారు ధ్రువీకరించారు. ఇందులో అప్పటి తెలుగు అక్షరాలు ఉన్నాయని, బాణరాజు దవళయరాజు… చారికమయకు కొంత పొలం బహుమతిగా ఇచ్చినట్లు నమోదు చేసినట్లు అనిపిస్తుందని పురావస్తు శాఖ అధికారులు తెలిపినట్లు వేంపల్లె గంగాధర్‌ వివరించారని భాస్కర్‌ పేర్కొన్నారు.