News

శ్రీశైలం అడవుల్లో దారి తప్పిన భక్తులు సురక్షితం

346views

ప్రకాశం జిల్లా నల్లమల అడవుల్లో దారితప్పిన భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. నిజాంపట్నానికి చెందిన మోపిదేవి ఓంకార్‌, సాంబశివరావు (కర్రీస్‌ పాయింట్‌ నిర్వాహకుడు)లు కుటుంబ సభ్యులతో పాటు కొంతమందిని కలుపుకుని మొత్తం 15 మంది ఈ నెల 16న శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. మల్లికార్జునస్వామి ఆలయంలో దర్శనం పూర్తయ్యాక నల్లమల అడవుల్లోని ఇష్టకామేశ్వరిదేవి ఆలయం సందర్శించేందుకు అడవిమార్గాన వెళుతూ దారి తప్పారు. ఈ విషయాన్ని గ్రహించి భయాందోళనకు గురైన వీరు సాయంత్రం 6 గంటల సమయంలో 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. దీంతో పోలీసులు, స్థానిక ఫారెస్ట్‌ అధికారుల సహాయంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో భక్తుల ఆచూకీ తెలుసుకుని, సురక్షితంగా శ్రీశైలం ప్రాంతానికి తరలించారు.