
పర్వదినాల్లో కృష్ణా జిల్లా అవనిగడ్డ ఆర్టీసీ డిపో నుంచి ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ధనుర్మాసంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలైన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి, అప్పనపల్లి బాల బాలాజీస్వామి, గొల్లలమామిడాడ కోదండ రామస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి, ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాలను దర్శించేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 13, 14, 20, 21, 27, 28, జనవరి 3, 4, 10,11 తేదీల్లో అవనిగడ్డ నుంచి (శుక్ర, శని వారాలు) రాత్రి 11.30 గంటలకు బయలుదేరి పెడన, బంటుమిల్లి, నరసాపురం, అమలాపురం మీదుగా పుణ్యక్షేత్రాలకు ఆయా తేదీల్లో బయలుదేరి వెళతాయి. ఛార్జీ సూపర్ లగ్జరీ రూ.1300. అడ్వాన్సు రిజర్వేషన్ సౌకర్యం కలదు.
ఈనెల 13న సాయంత్రం 5 గంటలకు అవనిగడ్డ బస్టాండ్ నుంచి అరుణాచలం గిరిప్రదక్షిణకు ప్రత్యేక బస్సు బయలుదేరి వెళ్తుందని డిపో మేనేజర్ చెప్పారు. 14న దర్శనం చేసుకొని తిరిగి వస్తుంది. ఈ ప్రయాణంలో కాణిపాకం, అర్ధవీడు, సిరిపురం, కంచి, విష్ణు కంచి, కామాక్షి అమ్మవారిగుడి, బంగారు బల్లి, తిరుత్తణి, శ్రీకాళహస్తి దర్శించుకొని తిరిగి అవనిగడ్డకు 16న వస్తుందని చెప్పారు. టికెట్ ధర రూ.3,000 అని చెప్పారు. ఇతర వివరాలకు 70363 35079, 99592 25466 ఫోన్ నంబర్లకు కాల్ చేసి సంప్రదించాలని చెప్పారు.





