
254views
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని వందేళ్ల నాటి గంధర్వమహల్ ఇప్పటికీ వన్నె తగ్గకుండా కాంతులీనుతోంది. ఈ భవనం ఉత్తర భారత నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. దీన్ని జమీందారు గొడవర్తి నాగేశ్వరరావు అభిరుచికి ప్రతీకగా అరెకరం విస్తీర్ణంలో నిర్మించారు. 1918లో నిర్మాణ పనులు మొదలుపెట్టి 1924లో పూర్తి చేశారు. గానుగ సున్నం, కోడిగుడ్ల సొనతో తయారు చేసిన మిశ్రమంతో నిర్మించడంతో ఇప్పటికీ చెక్కుచెదరలేదు. మహల్‌లో 25కి పైగా గదులున్నాయి. ఇక్కడి సెంట్రల్ హాలులోని పియానోకు 1885లో లండన్‌లో నిర్వహించిన పురావస్తు ప్రదర్శనలో రజత పతకం వచ్చింది. భవనానికి వందేళ్లు పూర్తికాగా, మరమ్మతులు చేయించి ముస్తాబు చేశారు. తాతయ్య గుర్తుగా.. పురాతన సంపదను కాపాడతామని గొడవర్తి నాగేశ్వరరావు మనవడు శ్రీరాములు చెబుతున్నారు.





