
191views
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులును అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధు సంరక్షణ సమితి అధ్యక్షులు కళ్యాణ స్వామి తెలిపారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో హిందూ నిరసన ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లిలోని భారత మాత విగ్రహం ఉన్న ప్రాంతం నుంచి బైపాస్ రోడ్డు వరకు ఈ సందర్బంగా హిందూ సంఘాలు నిరసనప్రదర్శన చేపట్టాయి.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై పోరాడుతున్న చిన్మాయ్ దాస్ అరెస్ట్ పై స్పందించినందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ బాంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై నిరసనకు మద్దతు ఇస్తే స్వామీజీలు అందరం భారీ సంఖ్యలో బాంగ్లాదేశ్ వచ్చి పోరాడతాం అని పేర్కొన్నారు.





