News

నెల్లూరులో అహిల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలు

233views

సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తోన్న రాణి అహిల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలలో భాగంగా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని నెల్లూరులో నిర్వహించారు. కర్నాటక రాష్ట్ర మాజీ ప్రిన్స్ పల్ సెక్రటరీ రత్నప్రభ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. సామాజిక సమరసతా వేదిక అఖిలభారత సంయోజక్ శ్యాంప్రసాద్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాణి అహిల్యాబాయి హోల్కర్ ధీరోదాత్తగా, మహిళలకు స్పూర్తిదాయకం అన్నారు. రాజ్యపాలనలో సమర్థనీయ చర్యలతోపాటు మహిళా సైన్యాన్ని జాతికి పరిచయం చేసిన ఘనత ఆమెదేనని పేర్కొన్నారు. విదేశీయుల ధ్వంసం చేసిన ప్రముఖ దేవాలయాలను పునర్ నిర్మించి సనాతన ధర్మానికి ఎనలేని సేవ చేశారన్నారు. మూడు వంద సంవత్సరాలకు పూర్వమే మహిళా సాధికారిత దిశగా అభ్యుదయ పాలన సాగించిన అహిల్యాబాయి జీవితం అదర్శనీయమని కొనియాడారు.