News

చంద్రబాబు నాయుడిని కలిసిన విశ్వహిందూ పరిషత్ జాతీయ నేతలు

208views

‘చర్చిలు, మసీదుల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోని ప్రభుత్వాలు.. ఆలయాలపై మాత్రం ఎందుకు పెత్తనం చేస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండేగారు ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల నిర్వహణను హిందూ సమాజానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే దీనికోసం జాతీయ స్థాయిలో చట్టం తేవాలన్నారు. ఈ అంశాలే ప్రధాన ఎజెండాగా, అందరిలో చైతన్యం కలిగించేందుకు జనవరి 5న విజయవాడలో భారీ ఎత్తున హైందవ శంఖారావం నిర్వహించనున్నామని మరోసారి ప్రకటించారు. ఈ మేరకు ఆయన, విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ఉపాధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు గారితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించాలని కోరుతూ, విశ్వ హిందూ పరిషత్ రూపొందించిన ముసాయిదా ప్రతిని శ్రీ మిలింద్ పరేండే గారు ముఖ్యమంత్రికి అందజేశారు. అనంతరం విజయవాడలో 2025 జనవరి5న తలపెట్టిన హైందవ శంఖారావం బహిరంగ సభ వివరాలను తెలియజేశారు. ఈ సమావేశంలో గుమ్మళ్ళ సత్యం గారు, శ్రీ వెంకటేశ్వర్లు గారు, దుర్గా ప్రసాద్ రాజు గారు మరియు టి.సత్య రవికుమార్ గారు పాల్గొన్నారు.