
తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూధర్మ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 5:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలోని టిటిడి కల్యాణ మండపంలో పవిత్ర కార్తిక దీపోత్సవం నిర్వహించనన్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. వైజాగ్‌లోని భక్తులందరూ ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొని శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహం పొందవలసిందిగా టిటిడి సాదరంగా ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ వేంకటేశ్వరుని పంచలోహ విగ్రహాలకు పూజలు నిర్వహించి, సంప్రదాయ వైదిక ఆచారాలను అనుసరించి టిటిడి అర్చకులు పూజలు నిర్వహించనున్నారు.ఈ కార్తిక దీపోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కార్తిక దీపం యొక్క దివ్యమైన కాంతిని అనుభవించడానికి మరియు భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు భక్తులకు ఇది ఒక అపూర్వ అవకాశమని..భక్తులందరూ పాల్గొని ఈ ఆధ్యాత్మిక వేడుకను ఘనంగా నిర్వహించవలసిందిగా టిటిడి కోరింది.





