News

దాడుల హెచ్చరికలతో దేశవ్యాప్త నిఘా

805views

దేశంలో పెద్ద దేవాలయాలు మరియు పెద్ద రైల్వే స్టేషన్లు లక్ష్యంగా ఉగ్రసంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు చేశాయి. ఇటీవల కాలంలో పలు కేసుల విచారణలో భాగంగా దాడుల పథకాలు బయటపడ్డాయి. దేశంలో అలజడి సృష్టించడమే ధ్యేయంగా జైష్ ఏ మహ్మద్ సంస్థ దాడులకు దిగే సూచనలు ఉన్నట్లు హెచ్చరికలు చేశాయి.
రైల్వే భద్రతా దళం నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైంది. అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో స్పెషల్ కమాండో ఫోర్స్ ‘కోరస్’ తరహా చర్యలకు కూడా సిద్ధమైనట్లు ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
పండుగ దినాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని అందుకు తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఉగ్రవాదుల కదలికలపైన, స్థానిక గ్యాంగ్‌స్టర్లపై భద్రతా దళాలు నిఘా పెంచారు. ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు… ప్రత్యేక నిఘా కెమెరాలను రైల్వే ఏర్పాటు చేసింది. ఉగ్రవాదుల, గ్యాంగ్ స్టర్ల ముఖకవళికలు గుర్తుపట్టేలా అన్ని నిఘా కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ కేంద్రానికి అధికారులు అనుసంధానం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.