News

గోరక్షణ కోసం దేశవ్యాప్త పాదయాత్ర… యాత్రలో గోమాత కూడా…

287views

దేశంలో గోరక్షణ జరగాలని, గోవులను కాపాడాలని పిలుపునిస్తూ అఖిల భారత గోసేవా ఫౌండేషన్ దేశ వ్యాప్త పాదయాత్ర చేపట్టింది. ఈ పాదయాత్రలో ఓ గోవు కూడా పాల్గొంటుంది. ఈ యాత్ర కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ సాగుతుంది. మొత్తం 14 రాష్ట్రాల మీదుగా 4,900 కిలోమీటర్ల మేర సాగుతుంది. చివరికి కన్యాకుమారిలో ముగుస్తుందని నిర్వాహకులు ప్రకటించారు. సెప్టెంబర్ 27 న కశ్మీర్ లో ఈ యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతోంది.

ఈ యాత్రా బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ కానుంది. ఈ భేటీకి యాత్ర చేస్తున్న గోవు కూడా వెళ్తోంది. హిందూ జీవనంలో గోవుకు ఎంతో ప్రాశస్త్యం వుందని, హిందువులందరూ గోమాతగా పిలుచుకుంటారని సంస్థ తెలిపింది. అలాగే వ్యవసాయానికి కూడా గోవు బాగా ఉపకరిస్తుందన్నారు. ఇంతటి ప్రాశస్త్యమున్న గోవు దేశంలో కాపాడబడాలని, సంరక్షింపబడాలన్నదే తమ లక్ష్యమని భారత గోసేవా ఫౌండేషన్ పేర్కొంది.