News

మెట్రో థీమ్‌తో నవరాత్రుల మండపం

272views

ప్రతీయేటా నవరాత్రులలో కోల్‌కతాలో దుర్గాపూజా మండపాలను అద్బుతంగా తీర్చిదిద్దుతుంటారు. భక్తులు వీటిని చూసి మైమరచిపోతుంటారు. ఇటువంటి మండపాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. అయితే వీటికి భిన్నమైన ఒక మండపం ఇప్పుడు సోషల్‌ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో తొలుత అండర్ వాటర్ మెట్రో లోపల ఓ వ్యక్తి వీడియో తీస్తున్నట్లు కనిపిస్తుంది. తరువాత అద్భుత దృశ్యం కనిపిస్తుంది. నిజానికి ఇది మెట్రో కాదు. నీటి అడుగున మెట్రో థీమ్‌తో రూపొందించిన దుర్గాపూజా మండపం. వీడియో చివరిలో దుర్గమ్మవారి విగ్రహం కనిపిస్తుంది . పలువురు భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు.


ఈ వీడియోను చూసినవారంతా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దీనిని షేర్ చేస్తున్నారు. ఈ వీడియో @ChapraZila అనే పేజీ నుండి పోస్ట్ అయ్యింది. దాని క్యాప్షన్‌గా ‘కోల్‌కతాలోని మెట్రో మార్గంలో నిర్మించిన దుర్గామాత మండపం’ అని రాసివుంది. ఈ వీడియోను ఇ‍ప్పటివరకూ 36 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు.