News

హైందవ ధర్మ పరిరక్షణ కోసం సైకిల్ యాత్ర

309views

హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి వెలకట్టలేనిదని శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం ఆలయ కార్యనిర్వహణాధికారి జి. గురునాదరావు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో ఆదిత్యా జుంబా నడక సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నం నుండి కలకత్తా సైకుల్ పై వెళ్తున్న మహేంద్ర అనే యాత్రికునికి శ్రీకాకుళంలో స్వాగతం పలికారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ట్రస్ట్ అధ్వర్యంలో మహేంద్రకు సంఘీభావం తెలిపారు. ఆరోగ్య భారత్ సాధనకు సైకిల్ యాత్ర ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. దసరా పండగ సందర్భంగా కలకత్తా కాళీమాతను దర్శించుకునేందుకు విశాఖ జిల్లా అచ్చుతాపురం నుండి కలకత్తా వెళ్తున్నానని సాహస యాత్రకులు మహేంద్ర మీడియాకు వెల్లడించారు. వారం రోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని అన్నారు. దారి పొడుగునా హైందవ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేసుకుంటూ.. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ యాత్ర సాగిస్తున్నారు. ఆదిత్యా జంబా డాన్స్ బృందం సాహస యాత్రికునికి. అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహేంద్ర సేవలు కొనియాడారు. గతంలో కూడా అనేక సాహస యాత్రలు చేశానని, ఇది ముమ్మాటికీ హైందవ ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న సైకిల్ యాత్ర అని ఆయన స్పష్టం చేశారు.