
ఢిల్లీ యూనివర్శిటీలో జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్(ఏబీవీపీ) ఘనవిజయం సాధించింది. నాలుగు స్థానాలకు పోటీపడగా ఏబీవీపీ మూడు పదవులను దక్కించుకుంది. కాంగ్రెస్ అనుబంధ సంస్థ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) ఒక పోస్టును కైవసం చేసుకుంది.
ఏబీవీపీ తరపున బరిలో నిలిచిన అధ్యక్ష అభ్యర్థి అక్షిత దహియా, ఉపాధ్యక్ష అభ్యర్థి ప్రదీప్ తన్వార్, జాయింట్ సెక్రటరీ అభ్యర్థిగా శివాంగీ ఖర్వాల్‌లను విజయం వరించింది. ఎన్‌ఎస్‌యూఐ నుంచి ఆకాష్ చౌదరి గెలిచి ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీ పోస్టును సొంతం చేసుకున్నాడు.
గతేడాది 44.46శాతం పోలింగ్ జరగగా.. ఈ ఏడాది 39.90శాతం మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌కు 52 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. స్టూడెంట్స్ యూనియన్ పోల్స్‌కు 144 ఈవీఎంలను వినియోగించగా.. కాలేజ్ యూనియన్ పోల్స్‌కు 137 ఈవీఎంలను వినియోగించారు.





