News

హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు

25views

హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ – కాన్పూర్, హైదరాబాద్-అయోధ్య మధ్యన వారానికి 4 రోజుల సర్వీసులు నడపనున్నారు. రేపటి(శనివారం) నుంచి హైదరాబాద్ – ప్రయాగరాజ్ మధ్యన, హైదరాబాద్-ఆగ్రా మధ్యన వారానికి 3 రోజుల సర్వీసును ప్రారంభించనున్నారు.

హైదరాబాద్ నగరం నుంచి ఒక్క నెలలోనే 7 నూతన సర్వీసుల ప్రారంభం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నూతన సర్వీసులు ఆయా నగరాల మధ్యన ప్రయాణికుల డిమాండ్‌ను నెరవేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కిషన్‌రెడ్డి ప్రయాణికులను కోరారు.