News

పళని పంచామృతంపై తమిళ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు

15views

పళని ఆలయంలో భక్తులకు అందజేసే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతున్నారని ఆరోపించిన తమిళ దర్శకుడు మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం చెన్నైలో అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు తిరుచ్చికి తరలించారు.

పళనిలో పంచామృతంపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే అరెస్టుకు కారణమని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

తమిళ స్టార్ నటుడు విజయ్‌పైనా మోహన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ వన్నారపేట, తిరేలపతి, రుద్రతాండవం, భాగసూరన్ చిత్రాలకు మోహన్ దర్శకత్వం వహించారు.

మోహన్ అరెస్ట్‌ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అశ్వథామన్ సోషల్ మీడియాలో నిర్ధారించారు. ఎందుకు అరెస్ట్ చేశారన్నదానిపై మోహన్ కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించడం సరికాదన్నారు.