News

శ్రీనగర్‌లో దేశభక్తి పరవళ్లు… వైరల్‌ వీడియో

68views

భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఒక వీడియో దేశభక్తిని పరవళ్లు తొక్కిస్తోంది. దీనిని చూసిన భారతీయుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది.

ఈ వీడియోలో శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ దగ్గర ఓ యువకుడు జెండాను గాలిలో ఊపుతూ కనిపిస్తున్నాడు. ఆ యువకుడు ఖాకీ ప్యాంటు ధరించి, శరీరం పైభాగంలో త్రివర్ణాలను పెయింట్‌ చేయించుకున్నాడు. ఆ యువకుడి కడుపుపై ​​అశోకచక్రం, ఛాతీపై భారత్ అని రాసి ఉంది. అతను భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేయడాన్ని వీడియోలో చూడవచ్చు.

2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేశాక కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ముగిసింది. ఈ ఆర్టికల్‌ను తొలగించిన ఐదేళ్ల తర్వాత, కశ్మీర్‌లో శాంతి నెలకొంది. ఇక్కడి ప్రజలు ప్రధాన స్రవంతిలో చేరారు. భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జమ్ముకశ్మీర్ అత్యంత వేడుకగా చేసుకుంటోంది.