ArticlesNews

ఆరెస్సెస్‌, సేవా భారతి కార్యకర్తల సేవలు నిరుపమానమైనవి : ఇమ్మాన్యుయేల్ సీఎస్ఐ చర్చ్ ప్రీస్ట్

78views

ఘోర విపత్తును ఎదుర్కొంటున్న కేరళ వయనాడ్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ కార్యకర్తలు, సేవా భారతి కార్యకర్తలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అక్కడి బాధితుల విషయంలో ఆరెస్సెస్‌ కార్యకర్తలు చూపిస్తన్న ప్రేమాభిమానాలు, ఆపద నుంచి వారిని కాపాడడంలో స్వయంసేవకులు చూపిస్తున్న నిబద్ధత, అకుంఠిత దీక్ష వేనోళ్లలా పొగుడుతున్నారు. ఇదే కోవలో మెప్పాడిలోని క్రైస్తవ సేవా సంస్థ ఆల్‌ ఇమ్మాన్యుయేల్‌ చర్చి ప్రీస్ట్ కూడా ఆరెస్సెస్‌ కార్యకర్తలను, సేవా భారతి కార్యకర్తలు చేస్తున్న సేవలను ప్రశంసించారు.

వయనాడ్‌లో పరిస్థితులను చక్కదిద్దడానికి, ప్రజలకు సేవలందించడంలో ఆరెస్సెస్‌ కార్యకర్తలు అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేస్తూనే వున్నారని పొగడ్తలు గుప్పించారు. సేవల పరంగా, ప్రజలకు అవసరమైన వాటిని భద్రపరిచేందుకు, సేవా భారతి కార్యకర్తలు వుండేందుకు తాత్కాలికంగా చర్చిలో కొంత స్థలం ఇచ్చామని, తమ ప్రాంగణాన్ని అత్యంత క్రమశిక్షణతో సేవా భారతి కార్యకర్తలు వినియోగించుకుంటున్నారని పాస్టర్‌ తెలిపారు. అత్యంత క్రమశిక్షణగా పనిచేస్తున్నారని, దీంతో ఆరెస్సెస్‌ పట్ల తనకు గతంలో వున్న దృక్పథాన్ని పూర్తిగా మార్చేసుకుంటున్నానని ప్రకటించారు.

ఆరెస్సెస్‌ కార్యకర్తలతో కలిసి సేవ చేయడం తనకెంతో సంతోషాన్నిస్తోందని అన్నారు. తమ వద్దే క్యాంప్‌ ఏర్పాటు చేయాలని సేవా భారతి కోరిందని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని, వారికి అవసరమైన వాటిని సమకూర్చడం గొప్ప సేవగా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. వారి సేవలు నిరుపమానమైనవని .. వారి సేవకు సాటి మరోటి లేదని అన్నారు.

అన్ని రకాల విపత్తులు సంభవించిన ప్రదేశాలలో సేవా భారతి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 2004 డిసెంబర్‌లో వచ్చిన సునామీ, 2018 లో సంభవించిన భారీ వరదల సమయంలో సేవా భారతి చేసిన సేవా కార్యక్రమాలను కేరళ ప్రజలు చూశారు. అలాగే 2016 ఏప్రిల్‌లో కొల్లాం పుట్టినల్‌ లోని దేవాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 11 మంది మరణించారు. ఆ సమయంలో కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా కుళ్లిన మృతదేహాలను దహనం చేయడం, ఖననం చేయడంతో సహా అనేక సహాయ కార్యక్రమాలు చేశారు. మళ్లీ.. ఇప్పుడు యనాడ్‌లో సంభవించిన వయనాడ్‌ ప్రళయ సమయంలో కూడా ఆరెస్సెస్‌, సేవా భారతి కార్యకర్తలు చేస్తున్న సేవలను అందరూ ప్రశంసిస్తున్నారు.