ArticlesNews

పాక్ కనుసన్నల్లో భారత్ పైకి రోహింగ్యాస్త్రాలను సిద్ధం చేస్తున్న జైషే మొహమ్మద్

844views

మ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసి ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపధ్యంలో రగిలిపోతున్న ఐఎస్ఐ తన పెంపుడు కుక్కలైన తీవ్రవాద సంస్థల సాయంతో భారత్ లోని కాశ్మీర్ వ్యాలీతో సహా 7 రాష్ట్రాలలో పుల్వామా తరహా దాడులు చెయ్యాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

భారత దేశంలోని పలు ప్రాంతాలలో దాడులు నిర్వహించేందుకు బంగ్లాదేశ్లోని రోహింగ్యా ముస్లిములకు జైషే మొహమ్మద్ శిక్షణ ఇస్తున్నట్లు సరిహద్దు రక్షక దళం (BSF) తెలియజేసింది. ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్నజైషే మొహమ్మద్ కమాండర్ సాబేర్ అహ్మద్ బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లో ఆశ్రయం పొందుతున్న రోహింగ్యాలకు తీవ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నాడు.

జీ న్యూస్ కథనం ప్రకారం జైషే మొహమ్మద్ బంగ్లాదేశ్ విభాగం సభ్యులైన మౌలానా యూసఫ్ బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లో శరణార్ధులుగా ఉన్న అసంతృప్త రోహింగ్యా ముస్లిం యువకులకు తీవ్రవాద భావజాలాన్ని నూరిపోసి వారిని భారత్ పై జీహాద్ కు ఉసిగోలుపుతున్నాడు.  బంగ్లాదేశ్లోని హరిన్మర పర్వత ప్రాంతంలో ఈ శిక్షణ శిబిరాన్ని నడిపిస్తున్నట్లుగా తెలియ వచ్చింది. బంగ్లాదేశ్లోని జైషే మొహమ్మద్ సానుభూతిపరులు వారికి సహాయ సహకారాలందిస్తున్నట్లుగా జీ న్యూస్ కథనం.

భారత నిఘా వర్గాల సమాచారం మేరకు పాకిస్థాన్ గూఢచారి విభాగమైన ISI తమ దేశంలోని తీవ్రవాదులను భారత్ పై దాడులు నిర్వహించమని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. జైషే మొహమ్మద్ కమాండర్ అబ్దుల్ రవూఫ్ అస్గర్ ప్రస్తుతం భారత రక్షణ, భద్రతా దళాలపై దాడికి వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. అస్గర్ నాయకత్వంలోని 30 నుంచి 40 మంది తీవ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని LOC వద్ద భారత్ లో చొరబడేందుకు వేచి ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.