News

ఎర్ర స్మగ్లర్ల ‘కాషాయీకరణ’!

284views

పుత్తూరులో అక్రమ రవాణాకు సిద్ధం చేసి ఉంచిన ఎర్రచందనం దుంగలతో పాటు ఓ వ్యక్తిని అటవీశాఖ అధికారులు సోమవారం తెల్లవారు జామున అరెస్ట్‌ చేశారు. పుత్తూరు ఫారెస్ట్‌ రేంజర్‌ డి.మాధవి కథనం.. ఆదివారం రాత్రి సదాశివకోన అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తుండగా, మల్లేరిమిట్ట వద్ద ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేస్తున్న వ్యక్తులను అటవీ సిబ్బంది గుర్తించి వారిపై దాడి చేసి ఒకరి పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. సంఘటన స్థలంలో 107 కేజీల బరువు ఉన్న 14 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.80 వేలు ఉంటుంది. పట్టుబడిన వ్యక్తి తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై జిల్లా మంచమల్లికి చెందిన మునస్వామి మాణిక్యంగా గుర్తించారు. స్మగ్లర్లు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కాషాయ వస్త్రాలు ధరించి భక్తుల రూపంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు రేంజర్‌ మాధవి తెలిపారు. పుత్తూరు ఫారెస్ట్‌ రేంజి పరిధిలో కూంబింగ్‌ను నిరంతరం చేస్తున్నట్టు చెప్పారు.