News

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

234views

శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తితిదే ఈవో జె శ్యామలరావు దంపతులు కార్యక్రమంలో పాల్గొని ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు. శుద్ధి పూర్తయ్యాక సుగంద ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. తర్వాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాల అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.. ఈనెల 16న శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించామని ఈవో తెలిపారు. జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్ వో నరసింహకిశోర్, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.