News

పుతిన్‌తో అణుకేంద్రాన్ని సందర్శించిన మోదీ

221views

రష్యాలో భారత ప్రధానమత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా మాస్కోలోని అణుకేంద్రాన్ని ఆ దేశాధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్‌తో కలిసి మంగళవారంనాడు మోదీ సందర్శించారు. అణు సహకారం, సైంటిఫిక్స్ అడ్వాన్స్‌మెంట్‌ సహా వివిధ రంగాల్లో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం కీలకంగా ఉన్న తరుణంలో మోదీ మాస్కో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మాస్కో శివార్లరో ఉన్న ఈ అణుకేంద్ర రష్యా న్యూక్లియర్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్‌కు కీలకంగా నిలుస్తోంది. పరిశోధన, అభివృద్ధి, న్యూక్లియర్ సైన్సెస్‌లో ఎడ్యుకేషన్‌‌కు ఒక హబ్‌గా ఈ అణుకేంద్రం నిలుస్తోంది. ఆటమిక్ ఎనర్జీ కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమే వినియోగించాలనే రష్యా కమిట్‌మెంట్‌ను చాటుతోంది.

అణురంగంలో పరస్పర సహకారానికి సంబంధించిన రష్యా-భారత్ మధ్య సుదీర్ఘ చరిత్ర ఉంది. కుడాంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందు నుంచే ఈ సహకారం కొనసాగుతోంది. పరస్పర విశ్వాసం, సాంకేతక సహకారం, సంయుక్త వెంచర్లతో రష్యా-భారత్ మధ్య కొనసాగుతున్న భాగస్వామ్యం భారతదేశ ఇంధన అవసరాలు, టెక్నాలజీ అడ్వాన్‌‌మెంట్‌లో గణనీయ పాత్ర పోషిస్తోంది.

మోదీ ట్వీట్..
ప్రెసిడెంట్ పుతిన్‌తో కలిసి ఆటమ్ పెవెలియన్‌ను సందర్శించినట్టు మోదీ ఒక ట్వీట్‌లో తెలిపారు. ”ఇండియా-రష్యాల మధ్య సహకారానికి ఇంధనం (ఎనర్జీ) అనేది కీలకంగా నిలుస్తోంది. ఈ రంగంలో మరింత పటిష్ట సంబంధాల కోసం ఇరుదేశాలు ఆసక్తిగా ఉన్నాం” అని మోదీ ట్వీట్ చేశారు.