News

మద్యం, మాంసాహారానికి మత్స్యకారులు దూరం..

268views

మద్యం, మాంసాహారానికి మత్స్యకారులు దూరమవుతున్నారు. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. గుండెల్లో గుడి కట్టి, శ్వాసమీద ధ్యాస ఉంచి ధ్యానం వైపు అడుగుల వేయడమే నిజమైన భక్తిగా చెబుతున్నారు.

రాష్ట్రంలో అతిపెద్ద మత్స్యకార గ్రామంగా గుర్తింపు పొందిన పూడిమడక ఇప్పుడు ధ్యాన కేంద్రంగా వర్థిల్లుతోంది. గ్రామంలో బయటపడ్డ శివుని విగ్రహం చెంతనే స్వయంభూ ధ్యానసాగర శివాలయం, ప్రాణేశ్వరి పిరమిడ్‌ కేంద్రంలో ధ్యాన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 2021 నుంచి ప్రారంభమై నేటికీ నిరాటకంగా సాగుతున్నాయి. ప్రతి సోమవారం నిత్యాన్నదానంతో ఈ ధ్యాన సాగరం ముందుకెళ్తోంది. ప్రతి సోమవారం పదుల సంఖ్యలో మత్స్యకారులు ఇక్కడ జరిగే ధ్యానానికి హాజరవుతున్నారు. పూడిమడకతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతిరోజూ పిరమిడ్‌ కేంద్రానికి వస్తున్నారు. ధ్యానం కోసం హాజరయ్యే వారికి కోసం ఈ గ్రామానికి చెందిన మహిళలే స్వచ్ఛందంగా భోజనాలు సిద్ధం చేస్తున్నారు.

ఈ కేంద్రాన్ని సన్యాసిరావు స్థాపించారు. సముద్రంపై నుంచి వీచే చల్లని గాలుల మధ్య ఆసక్తి ఉన్న వారితో ధ్యానం చేయిస్తూ అందరిలో మార్పు తీసుకురాడానికి కృషి చేస్తున్నారు. బీ మత్స్యకారులకు చేపలతో విడదీయ్యరాని బంధం. మద్యం, మాంసాహారం లేనిదే వీరికి ఒక్కరోజూ గడవని పరిస్థితి. ఇంతటా మాంసాహారంతో ముడిపడి ఉన్న ఉన్న మత్స్యకారులను ఆధ్యాత్మికంగా ధ్యానం వైపు అడుగులు వేస్తున్న వీరు మద్యానికి, మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. చెడు అలవాట్లుకు దూరంగా ఉంచుతున్నారు. ఇప్పటికే ఈ గ్రామంలో 100 మంది శాకాహారులగా మారి మద్యానికి దూరంగా ఉన్నారు.

అయ్యోపాపం చేపలు..!

మద్యం, మాంసం లేనిదే రోజు గడవని పరిస్థితి నుంచి చేపలను చూస్తే అయ్యోపాపం చనిపోతున్నాయని అనుకుంటున్నా! చేపల వేపుడు చేస్తుంటే ఆవాసన భరించలేకపోతున్నాను. ఒకప్పుడు బీపీ, సుగర్‌ వ్యాధితో ఇబ్బందిపడే వాడని. ధ్యానం చేయడం వల్ల ఇప్పుడు అవేవీ కనిపించడంలేదు.

చోడిపల్లి పెంటయ్య, మత్స్యకారుడు

ఏదైనా సాధించగలననే ధైర్యం వచ్చింది

ధ్యానంతోనే ఏదైనా సాధించవచ్చనే ధైర్యం పొందాను. ధ్యానం అనేది నా జీవితంలో స్నేహంగా మారిపోయింది. మంచి స్నేహితుడుని ఏవిధంగా వదలలేమో దీనిని అంతే. ఎవరితో ఏవిధంగా ఉండాలి.. ఎలా మాట్లాడాలనే విషయం ధ్యానం వల్లే తెలిసింది. ధ్యానంలోకి ఒకసారి వెళ్తే దానిని మళ్లీ వదలలేం.

వరపుల అఖిల, పూడిమడక

ఇంటినే ధ్యానకేంద్రంగా మార్చా…

పదో ఏట ధ్యానం పరిచయమైంది. వంశీ మాస్టర్‌ రాసిన కర్మచక్ర పుస్తకం చదివి శాకాహారిగా మారిపోయాను. ధ్యానం బోధించాలనే లక్ష్యంతో ఇంటినే ధ్యాన కేంద్రంగా మార్చాను. ఇప్పటివరకు 100 మందిని శాకాహారులుగా మార్చగలిగాను.

సన్యాసిరావు, గురువు, పూడిమడక