News

ఖైరతాబాద్‌ వినాయకుడు.. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి

306views

సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి ఖైరతాబాద్‌ మహా గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈమేరకు ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్‌తో పాటు నిపుణులైన వెల్డింగ్‌ కళాకారులు పనులను వేగవంతం చేశారు. గతంలోనూ సప్తముఖ మహా గణపతిని తయారు చేసినా, ఈ ఏడు కాలమానం ప్రకారం ప్రపంచశాంతితో పాటు సర్వజనులకు ఆయురారోగ్యాలు కలిగేలా గణపతిని సప్తముఖాలతో పూజించాలని దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విఠల శర్మ సూచించారు. ఆయన చెప్పినట్లే ఉత్సవ కమిటీ, ప్రధాన శిల్పి రాజేంద్రన్‌ గణపతి రూపాన్ని నిర్ణయించారు.