News

నాయకులు దివ్యగుణ సంపన్నులుగా మెలగాలి

181views

ప్రజల్ని పాలించే నాయకులు దివ్యగుణ సంపన్నులుగా మెలగాలని, అహంభావం వీడి అందరిపట్ల సమభావం చూపాలని పూరీ శంకరాచార్య నిశ్ఛలానంద సరస్వతి ఉద్బోధించారు. ఆదివారం రాత్రి పూరీలోని ఆదిశంకరాచార్య స్థాపిత గోవర్థన పీఠంలో రథయాత్రను పురస్కరించుకుని శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి భక్తులకు దివ్యజ్ఞాన బోధనలు చేశారు. పాలకులు ధర్మ, సత్యమార్గాలు వీడరాదని, సదాచార పారాయణులు కావాలన్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి, ఆయన మంత్రివర్గ సహచరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి

ఆదివారం రాత్రి పూరీలోని రామానుజ మఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. రామానందాచార్య స్వామి రామభద్రాచార్య ఇక్కడ ఆథ్యాత్మిక ప్రవచనం చేశారు. వేదాలు, ఉపనిషత్తుల సారం వివరించిన స్వామిజీ ప్రతీఒక్కరు ఆధ్యాత్మిక జ్ఞానం అలవర్చుకోవాలని, ఇది తరగని సంపద అని వివరించారు. శాసనసభాపతి సురమా పాఢి, ముఖ్యమంత్రి మోహన్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతర మంత్రులు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.