News

రామోజీరావు మృతికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. సంతాపం

68views

రామోజీరావు మృతి పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. “ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకులు శ్రీ రామోజీరావు మృతి జర్నలిజం, సినిమా రంగానికి తీరని లోటు. ఆయన ఎంచుకున్న రంగంలో ప్రత్యేకతను చాటుతూ వినూత్న ఆలోచనలకు మార్గదర్శకుడిగా ఆయన సహకారం చిరకాలం గుర్తుండిపోతుంది. ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు మరియు అసంఖ్యాక అభిమానులకు మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము మరియు ఆయన ఆత్మకు సద్గతి ప్రసాదించాలని సర్వేశ్వరుడిని ప్రార్థిస్తున్నాము.” అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ప్రకటనలో తెలిపారు.