అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ లోయలో అద్భుతమైన నీలి చీమలను పరిశోధకులు కనుగొన్నారు. బెంగుళూరుకు చెందిన అశోకా జీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థ(అట్రీ), ఫెరిస్ క్రియేషన్స్‌లకు చెందిన సంయుక్త పరిశోధనా బృందం ఈ అరుదైన చీమల జాతిని కనిపెట్టింది. అపూర్వమైన జీవవైవిధ్యానికి నెలవైన సియాంగ్ లోయలో స్థానిక తెగలను అణచివేయడానికి 1912-1922లో బ్రిటిష్ వలస ప్రభుత్వం దండయాత్ర చేపట్టింది. ఆ దండు వెంట వెళ్లిన పరిశోధకులు సియాంగ్ లోయలోని ప్రతి మొక్క, బల్లి, కప్ప, చేప, పక్షి, పురుగు, క్షీరదాన్ని భారతీయ మ్యూజియం రికార్డుల కోసం నమోదు చేశారు. వందేళ్ల తరవాత బెంగుళూరు పరిశోధకుల బృందం మళ్లీ సియాంగ్ లోయకు వెళ్లి తిరిగి సర్వే చేసింది. అక్కడి మారుమూల యింకు గ్రామంలో ఒక చెట్టు తొర్రలో రెండు నీలి చీమలను కనుగొన్నారు. వాటికి ‘పారాపారాట్రెకినా నీల’ అని నామకరణం చేశారు. మొత్తం 16,724 చీమజాతుల్లో నీలి రంగు చీమలు అత్యంత అరుదు.
442views
You Might Also Like
బీజింగ్‌లో భరతనాట్యంతో మంత్రముగ్ధులను చేసిన చైనా కవలలు
బీజింగ్: చైనాకు చెందిన కవల సోదరీమణులు జిన్ యాన్షు, జిన్ యానై భరతనాట్య ప్రదర్శనతో బీజింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.బీజింగ్ లో జరిగిన కార్యక్రమంలో ఈ 16 ఏళ్ల...
ప్రపంచంలోనే తొలి ఐవీఎఫ్ దూడ జననం- అసోం యూనివర్సిటీ పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ
2
దేశీయ పశు జాతుల పరిరక్షణలో అస్సోం మరో కీలక ముందడుగు వేసింది. పశుసంవర్ధక, బయోటెక్నాలజీ రంగంలో ఒక చరిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. అసోం రాష్ట్రానికి చెందిన...
ఇంద్రకీలాద్రిపై రెండో ఘాట్‌రోడ్డు – రూ.13 కోట్లతో అంచనాలు
7
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో ఘాట్‌రోడ్డు ఏర్పాటుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ఇందుకుగానూ దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం,...
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం సరికాదు
7
తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో టీటీడీ దృష్టికి వచ్చింది. దీనిపై టీటీడీ స్పందిస్తూ.. భక్తులు నిర్ధారణ...
అజ్ఞాత వీరులు – ‘రా’ అధికారులు
9
భారతదేశాన్ని రక్షిస్తున్నవారు ఎవరు? ఈ ప్రశ్నకు మనలో చాలామంది వెంటనే మన సైనికులు, పోలీసులు, సరిహద్దు భద్రతా దళాలు అని సమాధానం చెబుతారు. సరిహద్దుల్లో నిలబడి శత్రువులను...
ఓణం : కేవలం సాంస్కృతిక వేడుకేనా? హిందూ మూలాలపై కొత్త చర్చ
9
కేరళంలో ఓణం వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. ఈ పండుగకు సంబంధించిన మతపరమైన గుర్తింపుపై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఓణం కేవలం మలయాళ...




