News

వైద్యం కోసం అమెరికాకు వెళ్లనున్న దలైలామా

98views

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామా ఈ నెలలో అమెరికా వెళ్లనున్నారు. మోకాలి చికిత్స కోసం ఆయన అమెరికాకు వెళ్లనున్నట్టు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభం తరువాత దలై లామా విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఎటువంటి మీడియా సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొనరు. తిరిగి ధర్మశాలకు తిరిగొచ్చాక యాథావిధిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2017 జూన్ లో చివరి సారిగా దలై లామా అమెరికాలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన పలు సమావేశాల్లో పాల్గొనడంతో పాటు రోచెస్టర్ లోని మయో క్లినిక్ లో జనరల్ చెకప్ చేయించుకున్నారు.