రాయదుర్గంలో ప్రతి ఏటా బాలికతో ప్రసన్న వేంకటరమణుడి కల్యాణోత్సవాన్ని జరపటం అరవా తెగకు ఆనవాయితీగా వస్తోంది. పట్టణంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో పురప్రముఖులు, దేవాదాయశాఖ అధికారులు, భక్తుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పట్టణానికి చెందిన రమేష్, జయమ్మల కుమార్తె మౌనిక(10)తో శ్రీవారి నిశ్చితార్థం చేశారు. ఈనెల 25న ఉదయం 11గంటలకు పట్టణంలోని స్వామివారి ఆలయంలో ప్రజల సమక్షంలో శ్రీదేవి, భూదేవిలతో పాటు బాలికతోనూ వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహంతో కల్యాణం చేయనున్నారు. స్వామివారి తరఫున ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలాక్షిరెడ్డి, దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా కుమార్తె ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అలంకరించిన మౌనికను తల్లిదండ్రులు, బంధువులతో ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకువచ్చి, అర్చకులు బాలికతో వేంకటరమణుడి(కలశం)తో నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్ళారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు శివప్ప, కార్యదర్శి నాగప్ప, ఆసంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
328views
You Might Also Like
అఖండ గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు
అమరావతి: గోదావరి మహానదిని ఆరాధిస్తూ.. పుణ్యస్నానాలు, పూజలు, ధార్మిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది....
కశ్మీరీ పండిట్ల ఊచకోతపై 28 ఏళ్ల తర్వాత మళ్లీ దర్యాప్తు
5
జమ్మూకాశ్మీర్ లోని వాందామాలో 1998లో 23 మంది కశ్మీరీ పండిట్ల నరమేధంపై ఆ రాష్ట్ర దర్యాప్త సంస్థ(ఎసీఐఏ) పునర్విచారణ ప్రారంభించింది. లోయలో ఉగ్రవాదులు జరిపిన ఘాతుకాలకు సంబంధించిన...
ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. యూపీ విద్యార్థిని పిటిషన్‌ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు..
6
పాఠశాల యూనిఫామ్‌తో పాటు హిజాబ్ లేదా తలపై స్కార్ఫ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది....
భూమిపై తొలి జీవం భారత్‌లోనే పుట్టిందా?
34
భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ప్రాచీన ఆధారాలను భారతీయ భూగర్భ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. జార్ఖండ్‌లోని సింగ్భూమ్ క్రేటన్ శిలల్లో సుమారు 350 కోట్ల (3.5...
పాకిస్తాన్ కుట్రల బారిన పడకుండా గురుద్వారాల ద్వారా ISI ప్రమాదాలపై అవగాహన
31
పాకిస్తాన్ తన దుష్టచర్యలను మానడం లేదు. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని, యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా చేసే కుట్రలు చేస్తోంది. దీనిని తిప్పికొట్టడానికి పంజాబ్‌లోని సిక్కు సమాజం పాకిస్తాన్‌పై పోరాటం...
స్వామి లక్ష్మణానంద శత జయంతి వేడుకలు ప్రారంభం
17
భువనేశ్వర్ : మత ఛాందసుల చేతిలో ఘోరంగా హత్యకు గురైన స్వామి లక్ష్మణానంద శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆయన జన్మస్థలమైన గురుజంగ్ కేంద్రంగా ఇవి ప్రారంభమయ్యాయి....





