విజయనగరంలోని కొత్తవలస సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం వ్యవస్థాపకురాలు మల్లువలస సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. సీఐఐ ఫౌండేషన్ మైక్రో ఎంటర్‌ప్రైజస్ విభాగంలో ఉమెన్ ఎక్సెంప్లర్ అవార్డు-2024 వరించింది.ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక వ్యాపార సమ్మిట్‌లో ఆమెకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రదానం చేశారు. ట్రోఫీ, ధ్రువపత్రం, రూ.3 లక్షల నగదును అందజేశారు. విజయనగరం జిల్లాలో 20 వేల మంది మహిళలకు జీవనోపాధి అవకాశాలు కల్పించినందుకు గానూ ఆమెకు ఈ అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా 300లకు పైగా నామినేషన్లు దాఖలు కాగా ఆన్లైన్లో ముఖాముఖి నిర్వహించి, క్షేత్రస్థాయిలో చేపట్టిన పనుల తీరును పరిశీలించి 16 మందిని ఎంపిక చేయగా.. అందులో సరస్వతి ఒకరు. ఈమె గృహహింస, లింగ వివక్షపై పోరాటాలు చేశారు. ఆహార భద్రత కోసం చేపట్టిన కార్యక్రమాలతో గుర్తింపు పొందారు. చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం ద్వారా వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ఈ మేరకు ఎంపిక చేసినట్లు సీఐఐ పేర్కొంది.
340views
You Might Also Like
ఆలయ ప్రదక్షిణ : భక్తి, వినయం, అంతర్ముఖతకు ఆధ్యాత్మిక మార్గం
హిందూ ధర్మంలో ప్రతి ఆచారానికీ ఒక అంతరార్థం ఉంటుంది. ఆలయానికి వెళ్లడం, గర్భాలయ దర్శనం చేసుకోవడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, నమస్కరించడం వంటి ప్రతి సంప్రదాయమూ మనిషిని బాహ్య...
‘అద్వైతసిద్ధి’కి తెనాలి పరీక్ష
తెనాలి పరీక్ష". నేడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. ఇంతకీ ఏమిటీ పరీక్ష.. అంత కఠినంగా ఉంటుందా.. దేశం మొత్తమ్మీద ఒక్క తెనాలిలోనే ఎందుకు నిర్వహిస్తారు? ప్రధాని...
దయ చూపండంటున్నా.. మహిళకు షరియా శిక్ష 100 కొరడా దెబ్బలు
14
ఇండోనేషియాలోని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు అక్కడి అధికారులు దారుణమైన శిక్ష విధించారు. అచే ప్రావిన్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బహిరంగంగా శిక్ష అమలు చేస్తున్న సమయంలో...
ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
11
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన 10 కిలోమీటర్ల రన్నింగ్ రేసులో పలువురు మహిళలు తలపై హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించకుండా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా...
శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోండి.. విద్యార్థులకు అజిత్ డోభాల్ పిలుపు
35
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ విద్యార్థులకు సూచించారు. ఇందుకోసం శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా...
పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
10
పాకిస్థాన్, తాలిబాన్ల మధ్య విభేదాలు మళ్లీ తీవ్ర రూపాన్ని దాల్చాయి. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఒక భారీ తీవ్రవాద దాడి తర్వాత, ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌కు...





